Tandur

కాఖీ కాబ్జా పై విచారణకు ఆదేశం...!

By · · Updated

Share this article
కాఖీ కాబ్జా పై విచారణకు ఆదేశం...!

_ అభయం న్యూస్’ కథనానికి స్పందన.. విచారణకు ఆదేశం

_  గతంలో యలాల్ మండలం విశ్వనాథ్‌పూర్‌లోనూ జవాన్‌పై ఫిర్యాదు!

తాండూరు, అక్టోబర్ 6 (అభయం న్యూస్):
పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో దాయాదుల మధ్య చిచ్చుపెట్టి రూ.70 లక్షల భూమిని కాజేసిన ఎస్బీ కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులు స్పందించారు. 'అభయం న్యూస్' కథనానికి స్పందించిన ఉన్నత అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 
సదరు ఎస్బీ జవాన్‌పై గతంలో యలాల్ మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కూడా ఈ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి.  
ప్రస్తుతం హన్మాపూర్ భూకబ్జాతో పాటు, గతంలో అతడిపై ఉన్న ఆరోపణల సైతం  జిల్లా పోలీస్ శాఖ సమగ్ర విచారణ జరుపుతుందని తెలుస్తుంది. ఈ వ్యవహారం లో  ఎస్బి జవాన్ కు సహకరించిన వారిపై కూడా విచారణ జరిపేలని భూబాధితులు అధికారులను కోరినట్లు సమాచారం.

Tags: