Tandur

కాగ్నా లో కలకలం...!

By · · Updated

Share this article
కాగ్నా లో కలకలం...!

_ నదిలో వందలాది చేపలు మృతి.. 

_ కలకలం రేపుతున్న ఘటన

_గ్రామస్థుల్లో పలు అనుమానాలు 

బషీరాబాద్, అక్టోబర్ 23(అభయం న్యూస్)  బషీరాబాద్ మండలం జీవంగి గ్రామం సమీపంలోని కాగ్నానది చెక్‌డ్యాం వద్ద వందలాది సంఖ్యలో చేపలు మృతి చెందాయి. గురువారం ఉదయం చెక్‌డ్యాం నీటిలో చేపలు మృతి చెంది తేలియాడటాన్ని స్థానికులు గుర్తించారు.
ఒక్కసారిగా భారీ సంఖ్యలో చేపలు చనిపోవడంతో స్థానికుల్లో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా నదిలో రసాయనాలు లేదా విష పదార్థాలు కలిపారా? లేక నీటి కాలుష్యం పెరిగి ఆక్సిజన్ అందక చనిపోయాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై తక్షణమే సంబంధిత మత్స్యశాఖ, రెవెన్యూ మరియు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి నమూనాలను సేకరించి, చేపల మృతికి గల అసలు కారణాలపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags: