Tandur

జుంటుపల్లి ఆయకట్టుకు జలకళ

By · · Updated

Share this article
జుంటుపల్లి ఆయకట్టుకు జలకళ

_ రూ. 5.71 కోట్లతో కాల్వల ఆధునీకరణ పనులకు శ్రీకారం

_  రైతుల ముఖాల్లో ఆనందం నింపడమే నా లక్ష్యం

_ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

తాండూరు/యాలాల్, అక్టోబర్ 14 (అభయం న్యూస్): తాండూరు నియోజకవర్గంలో సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తూ రైతాంగ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి  స్పష్టం చేశారు. యాలాల్ మండల పరిధిలోని జుంటుపల్లి ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణ పనులకు ఆయన బుధవారం రూ.5.71 కోట్ల నిధులతో  శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో సాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైతులకు చివరి ఆయకట్టు వరకు నిరంతరం సాగునీరు అందించడమే తన ప్రధాన ధ్యేయమని అన్నారు. కాలువల ఆధునీకరణ ద్వారా నీటి వృథా తగ్గి, చివరి భూముల వరకు సాగునీరు సులభంగా అందుతుందని, దీనివల్ల వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జుంటుపల్లి ప్రాజెక్ట్ కాల్వల పునరుద్ధరణ పనులు అటకెక్కిపోయా యని, తాండూరు రైతులకు సాగునీరు అందించాలనే కనీస ఆలోచన గత పాలకులకు లేదని విమర్శించారు. ఇప్పటికే రూ.100 కోట్లతో చేపట్టిన కోట్పల్లి ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని, నేడు జుంటుపల్లి పనులను ప్రారంభించామని తెలిపారు. జుంటుపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా తీసుకువచ్చి పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల ముఖాల్లో ఆనందం, పొలాల్లో పచ్చదనం చూడటమే తన ఆశయమని పేర్కొన్నారు.

Tags: