_ తల్లీ బిడ్డ మృతి పై బిఆర్ఎస్ నాయకుల స్పందన
_ మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో బాధితులకు మద్దతు
_ ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని డిమాండ్
తాండూరు అభయం న్యూస్: వైద్యుల నిర్లక్ష్యనికి మృతి చెందిన తల్లీ బిడ్డ కుటుంబానికి బిఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. మాత శిశు ఆసుపత్రి లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వెంటనే వారిని సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
తాండూరు మండలం జింగూర్తి గ్రామానికి చెందిన బాలమణి ప్రసవం కోసం వచ్చి అనంతరం తల్లీ బిడ్డ మృతి చెందిన సంఘటన పై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు మాత శిశు ఆసుపత్రి ని సందర్శించారు. తల్లీ బిడ్డ మృతి చెందిన సంఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రి సూపరిండెంట్, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో నాయకులు కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడి.... ఘటన సమాచారాన్ని వివరించారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ....మాత శిశు ఆసుపత్రి లో ప్రైవేట్ ట్రైనింగ్ చేస్తున్న వైద్యులను నియమించకుండా కేవలం ప్రభుత్వ వైద్యులనే నియమించాలని, ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్ లో ప్రాక్టీస్ చేస్తున్న వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత రెండేళ్లుగా తాండూరు మాత శిశు ఆసుపత్రి లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది మృతి చెందారని, ఆలా జరిగిన ప్రతి సారి ఎదో ఒక విచారణ పేరుతో మభ్య పెట్టి దాటావేస్తున్నారని ఆరోపించారు. మాత శిశు ఆసుపత్రి కి పేద ప్రజలు వస్తారని వారికీ తగిన వైద్యం ఆసుపత్రి లో సక్రమంగా అందడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో జరిగిన మరణాలు కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి 50లక్షల నష్టపరిహారం అందించాలని, అదేవిదంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.







