_ నవాంద్గి రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
_ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
బషీరాబాద్, అక్టోబర్ 18 (అభయం న్యూస్): రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బషీరాబాద్ మండల పరిధిలోని నవాంద్గి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాంద్గి రైల్వే స్టేషన్ ఆవరణలో ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు మార్గాన్ని దాటేందుకు యత్నించాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో సదరు వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన తీరును చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం అందలేదు. స్థానికులు గమనించి ప్రచారం చేయడంతోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







