అభయం ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్‌లో శివాజీ సర్కార్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. మంటపానికి చేరుకున్న అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆ గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డిని ఉత్సవ సమితి ప్రతినిధులు శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.
గణనాథుడి సేవలో మాజీ ఎమ్మెల్యే
అన్నదానం ప్రారంభించిన రోహిత్ రెడ్డి
By Vamshi · · Updated
Share this article







