Tandur

ఎమ్మెల్సీ ఎన్నికలపై బిఆర్ఎస్ సన్నాహాలు

By · · Updated

Share this article
ఎమ్మెల్సీ ఎన్నికలపై బిఆర్ఎస్  సన్నాహాలు

_ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయే లక్ష్యం

_  తాండూరులో పార్టీ సన్నాహక సమావేశం

 _ హాజరైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఇన్‌ఛార్జి శ్రీశైల్ రెడ్డి

అభయం న్యూస్ తాండూరు:  రాబోయే మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సన్నాహక సమావేశం తాండూరులో మంగళవారం నిర్వహించారు. తాండూరు  మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పైలెట్ రోహిత్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పంజుగుల శ్రీశైల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడమే ప్రధాన ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు సన్నాహకాలు, నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు, మరియు పార్టీ పరంగా చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి పార్టీ సైద్ధాంతిక బలాన్ని వివరిస్తూ ఓటర్లను సమీకరించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, అనుబంధ రంగాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: