_ 11వ వార్డులో భక్తిశ్రద్ధలతో దుర్గామాతా పూజలు
_ అమ్మవారిని దర్శించుకున్న కౌన్సిలర్ బంటు వేణు దంపతులు
_ వార్డు ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక ప్రార్థనలు
తాండూరు,అక్టోబర్ 19(అభయం న్యూస్): తాండూరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వార్డులో ఏర్పాటు చేసిన దుర్గామాతా మండపంలో బంటు కుటుంబం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ పూజా మహోత్సవంలో స్థానిక కౌన్సిలర్ బంటు వేణు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, మంగళ హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బంటు వేణు మాట్లాడుతూ... దుర్గామాతా దివ్య కటాక్షంతో 11వ వార్డు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వార్డు సమగ్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.







