Tandur

డయల్ యువర్ డిఎం..!

By · · Updated

Share this article
డయల్ యువర్ డిఎం..!

_ తాండూరు డిపోలో ‘డయల్ యువర్ డిఎం’ కార్యక్రమం

_ నేడు ప్రయాణికుల సమస్యలపై ఫోన్ ఇన్ నిర్వహణ

- వెల్లడించిన డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్

తాండూరు, అక్టోబర్ 13 (అభయం న్యూస్):
తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఉదయం ‘డయల్ యువర్ డిఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
డిపో పరిధిలోని ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు, బస్సుల రాకపోకల వేళలు, సర్వీసుల పెంపు లేదా ఇతర రవాణా సంబంధిత ఇబ్బట్లపై ప్రయాణికులు నేరుగా డిఎం తో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
బుధవారం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రయాణికులు 9063469572 నెంబరుకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు. తాండూరు డిపో పరిధిలోని ప్రజలు మరియు ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Tags: