_ 30వ వార్డులో చీరల పంపిణీ
_ తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి నాయకత్వంలో కార్యక్రమం
_ వార్డు మహిళల ముఖాల్లో తొణికిసలాడిన చిరునవ్వులు
తాండూరు, అక్టోబర్ 18 (అభయం న్యూస్): తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని 30వ వార్డులో మహిళలకు దసరా కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి నాయకత్వంలో, వార్డు కౌన్సిలర్ మెహరాజ్ బేగం మరియు సీనియర్ నాయకుడు నయీమ్ అఫ్ఫు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వార్డు పరిధిలోని మహిళలకు ప్రజాప్రతినిధులు స్వయంగా చీరలను అందజేశారు. పండుగ పూట ప్రజాప్రతినిధుల నుంచి కానుక అందుకోవడం పట్ల స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. తమ పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, గౌరవానికి కౌన్సిలర్ మెహరాజ్ బేగం, నయీమ్ అఫ్ఫు, అబ్దుల్ అలీమ్ షల్లో లకు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ... తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం విజయదశమి అని పేర్కొన్నారు. పండుగ వేళ వార్డు ప్రజల సంతోషంలో భాగస్వాములు కావడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మార్గదర్శకత్వంలో వార్డు నం. 30 ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అబ్దుల్ అలీమ్ షల్లో, వార్డు అధ్యక్షుడు అబూబకర్ సిద్ధిక్ మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.







