Tandur

చెంగోల్ బడులకు మహర్దశ..!

By · · Updated

Share this article
చెంగోల్ బడులకు మహర్దశ..!

_ చెంగోల్ ప్రభుత్వ పాఠశాలలకు రూ. 9 లక్షల నిధులు మంజూరు
_ కాంపౌండ్ వాల్ నిర్మాణం, మరమ్మతు పనులు ప్రారంభించిన సర్పంచ్ నర్సమ్మ
_ సహకరించిన ఎమ్మెల్యే బూయ్యని మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు

తాండూరు, అక్టోబర్ 23 (అభయం న్యూస్): తాండూర్ మండలం చెంగోల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భద్రతను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం రూ. 9 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన నిధులతో పాఠశాలల్లో చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియు మరమ్మతు పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ నర్సమ్మ ప్రారంభించారు.
గ్రామంలోని యూపీఎస్ ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ నూతన నిర్మాణానికి రూ. 7 లక్షలు, అలాగే జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ కాంపౌండ్ వాల్ రిపేర్ పనులకు రూ. 2 లక్షలు కేటాయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాల ప్రాంగణాల రక్షణ, విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఈ పనులు అత్యంత కీలకమైనవని సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ నిధుల మంజూరుకు విశేషంగా కృషి చేసిన తాండూర్ ఎమ్మెల్యే బూయ్యని మనోహర్ రెడ్డికి గ్రామ ప్రజల మరియు పాఠశాల సిబ్బంది తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిత, వార్డు సభ్యులు గోపాల్, రాములు, పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కిష్టప్ప, అలాగే ఎల్లమ్మ, వెంకటేష్, విజయ్, మంజుల, నాగేశం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags: