Tandur

బుచ్చమ్మకు అండగా కంజర్ల ఫౌండేషన్ 

By · · Updated

Share this article
బుచ్చమ్మకు అండగా కంజర్ల ఫౌండేషన్ 

_ కరెంటు షాక్ తో ఇళ్లు దగ్ధం 
_ నిత్యావసర సరుకులు అందజేత 
_ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా 

యాలల్, అక్టోబర్ 13(అభయం న్యూస్): మండల పరిధిలో కుమ్మరి బుచ్చమ్మ ఇళ్లు కరెంట్ షాక్ తో దగ్ధం అయినా సంఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కంజర్ల   విజయలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు బుచ్చమ్మ కుటుంబానికి అండగా నిలిచారు. యాలల్ మండలం రాస్నం గ్రామం లో ఇటీవల కుమ్మరి బుచ్చమ్మ ఇళ్లు షార్ట్సర్క్యూట్ తో ఇళ్లు కాలిపోయింది. దింతో స్పందించిన కంజర్ల  విజయలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు బుచ్చమ్మ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధి, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, ప్రకాష్ గౌడ్ లు మాట్లాడుతూ ..... బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా కంజర్ల  విజయలక్ష్మి ఫౌండేషన్ ఉంటుందన్నారు. భవిష్యత్ లో సహాయ సహకారాలు అందిస్తామని బుచ్చమ్మకు హామీ ఇచ్చారు. బుచ్చమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags: