_ తొలి మ్యాచ్ లో ఘన విజయం
_ 8 వికెట్ల తేడాతో గెలుపు
_ జోష్ లో బిఎస్ఆర్ టీం
తాండూరు,అక్టోబర్ 15(అభయం న్యూస్): మొదటి ఆటలోనే ఘన విజయం సాధించిన బిఎస్ఆర్ టీం. తాండూరు లో గురువారం ప్రారంభంమైన బిగ్ బాష్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో బిఎస్ఆర్ జట్టు బోణి కొట్టింది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో బిఎస్ఆర్ జట్టు, బాజిగర్ జట్టు పై 8వికెట్ల తేడాతో గెలుపుందింది. మొదట బాటింగ్ చేసిన బాజీగర్ జట్టు 39 పరుగులు చేసింది. దింతో తర్వాత బాటింగ్ కు వచ్చిన బిఎస్ఆర్ జట్టు టార్గెట్ ను సులభంగా పూర్తి చేసింది. 8 ఓవర్ల మ్యాచ్ లో కేవలం 3.4 ఓవర్ లోనే బిఎస్ఆర్ జట్టు తమ లక్షన్ని సాధించి గెలిచింది. మొదటి రోజు తొలి మ్యాచ్ లోనే విజయం సాధించిన బిఎస్ఆర్ జట్టు లో జోష్ నిండుకుంది.







