Tandur

బీజేపీ,కాంగ్రెస్ ఒక్కటే..!

By · · Updated

Share this article
బీజేపీ,కాంగ్రెస్ ఒక్కటే..!

_ కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలి

_ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తాండూరులో ధర్నా. 

_ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం పై జావీద్ ఆగ్రహం 

_ ఆందోళనలో పాల్గొన్న బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు

తాండూరు: అక్టోబర్ 10(అభయం న్యూస్):  ప్రజాస్వామ్య పరిరక్షణ, పారదర్శక ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరులో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ కౌన్సిలర్ జావీద్ పాల్గొని మాట్లాడుతూ...
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను భారీగా తొలగిస్తున్నారని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్షాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తోందని, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని జావీద్  ఆరోపించారు.
2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని నోటీసులు జారీ చేయడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ ఓట్ల తొలగింపు చర్యలకు నిరసనగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అయన డిమాండ్ చేశారు.
ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో  ఎస్‌ఐఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, స్థానికంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టామని తెలిపారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని వారు కోరారు.
అన్ని పార్టీ లు ఏకమై తాండూరు లో కేంద్రానికి వెతిరేకంగా ధర్నా చేస్తుంటే అధికార పార్టీ మద్దతు ఇవ్వకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల్లో రోడ్డుపై ధర్నాలు   చేస్తుంటే తాండూరు నుండి నాయకులు అక్కడికి వెళ్లి ధర్నాలు చేస్తున్నారు అని  ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహారిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎస్ఈఆర్ పై నోరు విప్పకపోవడం గమనార్ధం అన్నారు.

Tags: