Tandur

బిఆర్ఎస్  అసత్య ప్రచారాలను సహించేది లేదు

By · · Updated

Share this article
బిఆర్ఎస్  అసత్య ప్రచారాలను సహించేది లేదు

_  తప్పుడు ఆరోపణలు చేస్తే ఆధారాలతో ఎండగడతాం

 _ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ హెచ్చరిక

అభయం యాలల్ :  బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య, నిరాధార ప్రచారాలను ఇకపై సహించేది లేదని, తప్పుడు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆధారాలు, వాస్తవాలతో కౌంటర్ ఇస్తామని యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ స్పష్టం చేశారు. ఆరోపణలు చేసే ముందు బిఆర్ఎస్ నేతలు తమ పదేళ్ల పాలనపై ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా 
 మహిపాల్ ఓ ప్రకటన లో మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉండి హామీలను పక్కనపెట్టిన బిఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, గృహజ్యోతి వంటి పథకాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాజకీయ విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, అయితే ఆధారాలు లేని ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించారు. అబద్ధాలు ఎన్ని చెప్పినా నిజం మారదని, ప్రజలు అమాయకులు కారు, ఎవరి పాలన ఏమిటో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. ఇకపై బిఆర్ఎస్ చేసే ప్రతి తప్పుడు ప్రచారాన్ని ప్రజల ముందు ఆధారాలతో ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.

Tags: