Tandur

భవాని మాత సేవలో పైలెట్

By · · Updated

Share this article
భవాని మాత సేవలో పైలెట్

_ తుల్జాపూర్ భవానీ మాతను దర్శించుకున్న   పైలెట్ రోహిత్ రెడ్డి

_ నాయకులతో కలిసి తుల్జాపూర్ లో  అన్నదానం  చేసిన మాజీ ఎమ్మెల్యే 

తాండూరు,అక్టోబర్ 26(అభయం న్యూస్):  తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోమవారం ఉదయం మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా తుల్జాపూర్‌లో వెలసిన శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, బిఆర్ఎస్వి నాయకులు మరియు తన అభిమానులతో కలసి ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తుల్జాపూర్ స్థానిక మేయర్ మరియు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.
అనంతరం పైలెట్ రోహిత్ రెడ్డి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను బహుకరించారు.
అంతకుముందు ఆదివారం సాయంత్రం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని సేవలు అందించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో తాండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు పైలెట్ రోహిత్ రెడ్డి అభిమానులు  పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Tags: