అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330అభయం న్యూస్ లో ప్రకటనల కోసం వెంటనే సంప్రదించండి 9014105330
అభయం ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణంలో నిత్య పూజలందుకున్న లంబోదరుల నిమజ్జనోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది. స్థానిక ఉత్సవ కమిటీలు, ప్రజల భాగస్వామ్యంతో శోభాయాత్ర వైభవంగా సాగింది.శుక్రవారం ఉదయం నుంచే పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రారంభమైంది. రంగురంగుల విద్యుత్ కాంతులు, భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. "గణపతి బప్పా మోరియా" నినాదాలతో తాండూరు పురవీధులు మార్మోగాయి. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి మంగళ హారతులు పడుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు పక్కా ముందస్తు చర్యలు చేపట్టాయి. కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షించారు. తాండూరు హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్, తాగునీరు మరియు లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు అందించిన పూర్తి సహకారంతోనే నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా పూర్తయిందని హిందూ ఉత్సవ సమితి సభ్యులు, అధికారులు వెల్లడించారు. వేడుకలు ముగియడంతో పట్టణ ప్రజలతో పాటు స్థానిక యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది.
We use essential cookies for login/session so the site works.
With your consent we also use analytics cookies to improve CS News.
Read our Privacy Policy.