Tandur

ఆర్థిక సహాయం అందించిన జావీద్

By · · Updated

Share this article
ఆర్థిక సహాయం అందించిన జావీద్

_ మాతా శిశు ఆసుపత్రిలో తీవ్ర విషాదం

_ ప్రసవానంతరం తల్లీ, బిడ్డ మృతి.. 

_ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన 8వ వార్డు  బిఆర్ఎస్    కౌన్సిలర్ జావీద్

_ ఎమ్మెల్యే, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

అభయం తాండూరు:  స్థానిక మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి  లో బుధవారం చోటుచేసుకున్న తీవ్ర విషాదకర సంఘటన ప్రాంత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళ ప్రసవానంతరం పురిటి బిడ్డతో సహా మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. 
తాండూరు మండలం జింగూర్తి గ్రామానికి చెందిన బాలమణి అనే గర్భిణి ప్రసవ వేదనతో బుధవారం  పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి  వచ్చింది. ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డతో సహా తల్లీ మృతి చెందిన విషయం తెలిసిందే. 
ఆసుపత్రి సిబ్బంది, వైద్యాధికారుల అజాగ్రత్త వల్లే ఈ ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబీకులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
విషయం తెలుసుకున్న తాండూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గురువారం మృతురాలి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తన సొంత నిధుల నుంచి రూ. 10,000/- తక్షణ ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్  మాట్లాడుతూ... అత్యంత పేదరికంలో ఉన్న జింగూర్తికి చెందిన బాలమణి కుటుంబానికి ఈ ఘటన కోలుకోలేని దెబ్బ అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి  పరిహారం అందించాలని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ మృతిపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags: