Tandur

ఐక్యతతోనే స్మశానవాటిక అభివృద్ధి

By · · Updated

Share this article
ఐక్యతతోనే స్మశానవాటిక అభివృద్ధి

_ బీసీ స్మశానవాటికను సుందరంగా తీర్చిదిద్దుతాం

 _ రూ. 1 నుంచి 2 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక

 _ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో నిధుల సేకరణ

_ మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి    

అభయం తాండూరు టౌన్; సాయిపూర్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న బీసీ స్మశానవాటికను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి  స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.... గతంలో బీసీ స్మశానవాటిక సమస్యలపై ఎంతోమంది మాట్లాడినప్పటికీ, సమస్యల పరిష్కారానికి ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లోనే రూ.కోటి అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కాంపౌండ్ వాల్ నిర్మించినా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నిధుల మంజూరులో ఆలస్యం జరిగిందన్నారు. స్మశానవాటిక దుస్థితిపై 11వ వార్డు కౌన్సిలర్ వేణు, బీసీ నాయకులు మల్లేశం తదితరులు మున్సిపల్ అధికారులకు మెమోరాండం సమర్పించినట్లు తెలిపారు.
సాయిపూర్ తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ఈ స్మశానవాటిక ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సాయిపూర్ రోడ్డు వైపు మూసివేసిన గేటును తక్షణమే తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్మశానవాటిక అనేది కులమతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే పవిత్ర స్థలమని, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా దీనిని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, సీనియర్ నాయకులు ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Tags: