Tandur

7వ వార్డ్ లో బతుకమ్మ వేడుకలు

By · · Updated

Share this article
7వ వార్డ్ లో బతుకమ్మ వేడుకలు

_ ఎన్టీఆర్ కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

_ వైభవంగా వేడుకలు నిర్వహించిన మహిళలు

_ ఆధ్వర్యం వహించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు

తాండూరు, అక్టోబర్ 18 (అభయం న్యూస్): తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. స్థానిక మాజీ కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాతుల నాగు ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు కాలనీలోని మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బతుకమ్మలను ఒకచోట చేర్చి చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. మహిళల పాటలు, చప్పట్లతో కాలనీ ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. 
ఈ సందర్భంగా బాతుల నాగు మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. కాలనీవాసులంతా ఐక్యంగా, ఆనందోత్సాహాల నడుమ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలనీ మహిళలందరికీ ఆయన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: